: మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత!
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, రచయిత పీవీఆర్కే ప్రసాద్ మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ గుండెపోటుతో నేటి తెల్లవారు జామున మృతిచెందారు. నేటి ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ 'అసలేం జరిగిందంటే' పేరిట యథార్థ సంఘటనలతో ఓ పుస్తకం రాశారు. ఇంకా 'కర్త అతడే', 'తిరుమల చరితామృతం', 'తిరుమల లీలామృతం'.. వంటి పుస్తకాలు కూడా రాశారు. ఆయన మృతిపట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.