: ‘అర్జునరెడ్డి’ సినిమా పోస్టర్ పై వీహెచ్ మండిపాటు
‘అర్జునరెడ్డి’ సినిమా పోస్టర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. ఈ చిత్రం పోస్టర్లు ఆర్టీసీ బసులపై, బస్టాండ్ ల వద్ద ఉన్నాయని, చాలా అసభ్యంగా ఉన్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్న ఈ పోస్టర్లు యువతను చెడుదోవ పట్టించేలా వున్నాయంటూ విమర్శించారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ‘అర్జునరెడ్డి’ సినిమా ఈ నెలలో విడుదల కానుంది.