: నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం విధించాం: ఎలక్షన్ కమిషనర్ భన్వర్ లాల్


నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ భన్వర్ లాల్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎవరికి ఓటు వేస్తారని అడగడం చట్టవిరుద్ధమని అన్నారు. సర్వేల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నారని తమకు ఫిర్యాదు అందిందని, ఈ నేపథ్యంలోనే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం విధించామని చెప్పారు. ఏ చానెల్ అయినా సర్వేలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నంద్యాల ఉపఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించవద్దని, ప్రసారం చేయవద్దని భన్వర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News