: వంద పరుగులు పూర్తి చేసిన టీమిండియా.. కొనసాగుతున్న ధావన్-కోహ్లీ భాగస్వామ్యం!
శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా 108 పరుగులు చేసింది. భారతజట్టు తొలి వికెట్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ ధావన్ తో జతకట్టాడు. వీరి పార్టనర్ షిప్ లో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. 49 బంతుల్లో ధావన్ 68 పరుగులు, 33 బంతుల్లో కోహ్లీ 35 పరుగులతో కొనసాగుతున్నారు. ధావన్ 10 బౌండరీలు కొట్టగా, కోహ్లీ 5 ఫోర్లు బాదాడు. టీమిండియా స్కోర్: 16 ఓవర్లు ముగిసేసరికి 109/1.