: వర్షాల ఎఫెక్ట్... తెలంగాణలో ఆదివారం సెలవు రద్దు, భూ సర్వే వాయిదా!


తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో, ఆదివారం నాడు సెలవును రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులంతా నేడు అందుబాటులో ఉండాలని, వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చూసుకోవాలని, నాలాలను అనుక్షణం గమనిస్తుండాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండాలని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా భూముల రికార్డులను బయటకు తీసేలా తలపెట్టిన భూ సర్వేను వాయిదా వేస్తున్నట్టు కూడా వెల్లడించింది. భూ సర్వేను తిరిగి 23న జరిపిస్తామని, ఆ రోజున సెంటు భూమి ఉన్న వ్యక్తి కూడా అందుబాటులో ఉండాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News