: సూర్యగ్రహణం నేపథ్యంలో రేపు భూకంపాలు, సునామీకి అవకాశం: హెచ్చరించిన నిపుణులు
1979 తరువాత రేపు అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుండటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్పడటం, భూకంపాలు, సునామీలు సంభవించడం వంటి విపత్తులకు ఆస్కారముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు ఆరు గంటల పాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఈ గ్రహణం ఏర్పడే సమయంలో ఇండియాలో రాత్రి నడుస్తుంటుంది కాబట్టి, ఇండియాలో కనిపించదు. దాని కారణంగా గ్రహణ ప్రభావం భారత్ పై ఉండబోదు. ఇక ఈ తరహా సుదీర్ఘ గ్రహణం ఎన్నో ఏళ్ల తరువాతే కనిపించనుంది. రేపు కలిగే సంపూర్ణ సూర్యగ్రహణం భువిపై ఉన్న వివిధ రకాల ప్రాణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయమై నాసా పరిశోధనలు చేయనుంది. ఇదిలావుండగా, అమెరికాపై సూర్యగ్రహణ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాలను టోర్నడోలు వణికిస్తున్నాయి.