: వన్‌ ట్యాప్ బిల్లు పేమెంట్‌.. బీఎస్‌ఎన్‌ఎల్ వాలెట్ తో ఫీచర్ ఫోన్లలోనూ సులభతరంగా నగదు చెల్లింపులు!


తన చందాదారులకు వన్‌ ట్యాప్ బిల్లు పేమెంట్‌ పద్ధతిని అందుబాటులోకి తీసుకురానున్నామని, దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల కేంద్రాల ద్వారా ఈ సౌకర్యాన్ని తమ కస్టమర్లు వినియోగించుకోవచ్చని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఇందుకోసం ఓ మొబైల్‌ వాలెట్‌ను ప్రారంభించింది. నగదు బదిలీలను సులభతరం చేసేందుకు మొబిక్విక్‌ తో కలిసి ఈ వాలెట్‌ను ప్రారంభించామ‌ని చెప్పింది. ఈ వాలెట్ ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లకు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది.

దీని ద్వారా వినియోగదారులు ఆన్ లైన్ రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, బస్సు, రైలు టికెట్, షాపింగ్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. ఈ వాలెట్ స్మార్ట్‌ఫోన్‌ల‌లోనే కాకుండా ఫీచ‌ర్‌ఫోన్‌ల‌లో కూడా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది. ఈ సుల‌భ‌త‌ర చెల్లింపుల ప‌ద్ధ‌తి డిజిటల్ ఇండియాకి ఎంతో సాయ‌ప‌డుతుంద‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News