: నేను డొనాల్డ్ ట్రంప్‌తో ఇప్ప‌ట్లో మాట్లాడ‌ను: ఛార్లొట్స్‌విల్లే ఘ‌ర్ష‌ణల‌ బాధితురాలి త‌ల్లి


అమెరికాలోని వర్జీనియాలోని ఛార్లొట్స్‌విల్లేలో ఇటీవ‌ల పెద్ద ఎత్తున ఆందోళ‌న చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఆందోళ‌న‌కారుల‌పై ఓ కారు దూసుకెళ్ల‌డంతో హీథర్‌ హేయర్ అనే యువ‌తి మృతి చెందింది. అయితే, ఆమె త‌ల్లి సుషాన్‌బ్రోతో మాట్లాడ‌తాన‌ని ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆమె మాత్రం ఆయ‌న‌తో ఇప్పట్లో మాట్లాడ‌బోన‌ని తెగేసి చెబుతోంది. వైట్ హౌస్ నుంచి ఆమెకు ప‌లుసార్లు ఫోన్లు వ‌చ్చాయి. అధ్యక్షుడు మాట్లాడతారంటూ అధికారులు చెప్పినప్పటికీ ఆమె తిరస్కరించారు. ఈ క్రమంలో తాజాగా ఆమె అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ... ఆందోళన జరిగే సమయంలో ఏం జరిగిందో దానికి సంబంధించిన క్లిప్‌ను చూశానని, ఆ ఘ‌ట‌న‌ను చూసి ఉద్వేగానికి లోనయ్యాన‌ని చెప్పింది. 

  • Loading...

More Telugu News