: ఇప్పుడు గెలిచి ఆయన పొడిచేదేముంది?: చంద్రబాబు


నంద్యాల రోడ్ షోలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నంద్యాలకు ఆయన ఏమీ చేయలేదని... ఇప్పుడు గెలిచి ఆయన పొడిచేముందని అన్నారు. డబ్బు సంపాదనే వైసీపీ నేతల లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్ కు లేదని అన్నారు. వైయస్ హయాంలో రూ. 200 పెన్షన్ మాత్రమే ఇచ్చారని... ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా రూ. 1000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దొంగ బిల్లులు పెట్టి డబ్బు కాజేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడేవారిని తాను వదలనని... అవినీతిపరుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News