: ఓటమి భయంతోనే 12 రోజులుగా నంద్యాలలోనే తిష్ట వేశారు: జగన్ పై ఎమ్మెల్యే బుడ్డా విమర్శలు


నంద్యాల ఉప ఎన్నికలో కచ్చితంగా ఓడిపోతామనే భయం వైసీపీ అధినేత జగన్ కు పట్టుకుందని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఎలాగైనా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని గత 12 రోజులుగా నంద్యాలలోనే మకాం వేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న అభ్యర్థి ఎవరూ కూడా ఒకే నియోజకవర్గంలో 12 రోజుల పాటు ప్రచారం చేసిన దాఖలాలు ఇంతవరకు లేవని అన్నారు. కేవలం ఓటమి భయంతోనే జగన్ ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు. నంద్యాల ఓటర్లు చాలా తెలివైనవారని... వారంతా అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీకి ఓటు వేయడం దండగ అనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News