: ట్రంప్ అధ్యక్షుడు కావడానికి సహాయం చేసిన ప్రధాన వ్యూహరచనాధికారి స్టీవ్ బ్యానన్ పదవీచ్యుతి!
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రధాన వ్యూహరచనాధికారి స్టీవ్ బ్యానన్‌ను పదవి నుంచి తొలగిస్తూ వైట్ హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వర్జీనియాలోని చార్ల్స్‌ట్‌విల్లేలో జరిగిన ఉదంతంపై స్టీవ్ చేసిన వ్యాఖ్యలే ఆయనను తొలగించడానికి ప్రధాన కారణమని వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డెమోక్రాట్లను నాశనం చేయాలంటూ స్టీవ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికన్లు విమర్శల వర్షం గుప్పించారు. వీటి ఆధారంగానే ఇటీవల వైట్‌హౌస్ చీఫ్‌గా చేరిన జాన్ ఎఫ్. కెల్లీ, స్టీవ్‌ను పదవీచ్యుతిడిని చేశారు. స్టీవ్‌తో పాటు శ్వేతసౌధంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన మరికొంత మంది ఉద్యోగులు కూడా వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీవ్‌తో పాటు ఆయన నిర్వహిస్తున్న `బ్రీయిట్‌బార్ట్ న్యూస్` వెబ్‌సైట్ సేవల నుంచి కూడా వైట్‌హౌస్ విరమించుకోనుంది.