: వినాయక నిమజ్జనానికి మినీ ట్యాంకులు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ.... ట్వీట్‌లో వెల్లడించిన కేటీఆర్!
వినాయక చవితి సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనమయ్యే గణేశ్ విగ్రహాల సంఖ్యను ఎంతోకొంత తగ్గించడానికి జీహెచ్ఎంసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు చోట్ల మినీ ట్యాంకులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 25 మినీ ట్యాంకులను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రాయదుర్గం, కాప్రా, జీడిమెట్ల, గంగారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకుల ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. హుస్సేన్ సాగర్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రయత్నమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.