: కాకినాడ ఎన్నికలు: చినరాజప్పకు షాకిస్తూ ప్రత్తిపాటి పుల్లారావును తెరపైకి తెచ్చిన టీడీపీ


ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు షాకిస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తెరపైకి తీసుకొస్తున్నారా? అన్న చర్చ కాకినాడలో జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్పను కాదని కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతలను ప్రత్తిపాటి పుల్లారావుకు అప్పగించడంపై ఆ పార్టీ జిల్లా స్థాయి నేతల్లో పెద్ద చర్చ నడుస్తోంది.

కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి ఎంపిక బాధ్యతలు యనమల, కళావెంకట్రావు, చినరాజప్పలు తీసుకున్నారు. అలాగే ఈ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా చినరాజప్పకే అప్పగించారు. అయితే సీట్ల కేటాయింపుపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా, దానికి చినరాజప్ప దీటుగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చినరాజప్పను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను పుల్లారావుకు అప్పగించినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News