: ఉద్యోగ ప్రకటనలతో స్టడీ సెంటర్లను పెంచి పోషిస్తున్నారు: ఎమ్మెల్సీ పొంగులేటి
ఉద్యోగ ప్రకటనలతో స్టడీ సెంటర్లను పెంచి పోషిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 84 వేల ఉద్యోగాల ప్రకటన చేసిందని, అది అందని ద్రాక్షే అని, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్న చందంగా డ్రగ్స్ కేసు విచారణ నడుస్తోందని విమర్శించారు.