: ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని నదులు అనుసంధానం కావాలి: సీఎం చంద్రబాబు
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న అన్ని నదులు అనుసంధానం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. జలవనరుల పార్లమెంటరీ కమిటీ సభ్యులతో చంద్రబాబు ఈ రోజు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదుల అనుసంధానంతో రాష్ట్రాల మధ్య జల వివాదాలు తొలగిపోతాయని, దేశమంతా భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలని, ఏపీలో భూగర్భ జలాల పెంపునకు ఐదు లక్షల పంట కుంటలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సంపూర్ణ సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు.