: రాహుల్ గాంధీ ప్రసంగంపై నెటిజన్ల జోకులు!
రెండు రోజుల క్రితం బెంగళూరులో పర్యటించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ‘ఇందిరా క్యాంటీన్లు’ ప్రారంభించిన విషయం విదితమే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో చాలా తప్పులు దొర్లాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని అన్ని నగరాల్లో ఈ పథకం ప్రారంభిస్తున్నాం అనాల్సి ఉండగా.. 'బెంగళూరులోని ప్రతి ఒక్క నగరం' అన్నారు. అనంతరం క్యాంటీన్లు అనే పదానికి బదులుగా క్యాంపెయిన్లు అన్నారు. ఇక ఆయన ‘ఇందిరా క్యాంటీన్లు’ అనడానికి బదులు అమ్మ క్యాంటీన్లు అన్న విషయం తెలిసిందే. ఈ వీడియో చూస్తోన్న నెటిజన్లు రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్నారు. జాతీయ ఛానెళ్లు ఈ విషయాన్ని ‘రాహుల్ మిస్టేక్స్’ అని పేర్కొంటూ విమర్శిస్తున్నాయి.