: సిక్కా రాజీనామాకు ప‌రోక్ష కార‌ణం నారాయ‌ణమూర్తి?: అభిప్రాయ‌ప‌డుతున్న‌ విశ్లేషకులు


ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ నుంచి సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేయ‌డానికి దాని వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి ప‌రోక్ష కార‌ణ‌మ‌ని కార్పోరేట్ కంపెనీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సిక్కాను బ‌య‌ట‌కు పంప‌డానికి నారాయ‌ణ వేసిన ఎత్తుగ‌డ‌లను వారు, ఇటీవ‌ల 50 రోజుల్లో యూజ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపిస్తున్న‌ బ్లూవేల్ ఛాలెంజ్ ఆట‌తో పోలుస్తున్నారు. సీఎఫ్ఓ రాజీవ్ బ‌న్సాల్ వేత‌న విష‌యంలో, ప‌నాయా కంపెనీ విలీనానికి సంబంధించిన విష‌యాల్లో ఇన్ఫోసిస్ మాజీ వ్య‌వ‌స్థాప‌క బృందం, ప్ర‌స్తుత యాజ‌మాన్య బృందానికి మ‌ధ్య వచ్చిన మ‌న‌స్ప‌ర్థ‌లే సిక్కా రాజీనామాకు దారితీశాయ‌ని వారు పేర్కొన్నారు. వీటితో పాటు యాజ‌మాన్య బోర్డులో నిరంత‌ర మార్పులు, స్టేక్ హోల్డ‌ర్ల మ‌ధ్య అభిప్రాయ భేదాల వ‌ల్ల కూడా సిక్కా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాడ‌ని ఇన్‌గవ‌ర్న్ రీసెర్చి స‌ర్వీసెస్ ఎండీ శ్రీరాం సుబ్ర‌మ‌ణియ‌న్ అన్నారు. సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ షేర్ల విలువ ఒక్క‌సారిగా ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News