: షాపులకు పెద్ద పేర్లు పెట్టడాన్ని నిషేధించిన చైనా!
సాధారణంగా చైనాలో షాపులకు, కంపెనీలకు చాలా పొడవైన పేర్లు పెడుతుంటారు. ఇక నుంచి ఇలాంటి పెద్ద పేర్లను పెట్టకూడదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇంగ్లిషులోకి అనువదించినపుడు వింత అర్థం వచ్చే పేర్లను, కొత్తగా వింతగా ఉండే పేర్లను కూడా పెట్టవద్దని ఆదేశించింది. అంతేకాకుండా ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పేర్లను, మత విధానాలకు విరుద్ధంగా ఉండే పేర్లను పెట్టడంపై కూడా నిషేధం విధించింది. గతంలో భవనాలను వింతగా నిర్మించడంపై కూడా చైనా నిషేధం విధించింది. కొత్తదనం కోసం ఆధునిక పోకడలను అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా అధికారిక మీడియా అభిప్రాయపడింది.