: రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్ రియా సేన్!
గత కొంత కాలంగా ఫోటోగ్రాఫర్ శివమ్ తివారీతో డేటింగ్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్, అలనాటి అందాల తార మూన్ మూన్ సేన్ కుమార్తె రియా సేన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. బుధవారం నాడు పుణెలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో తమ పెళ్లి జరిగిపోయిందని ఈ జంట అధికారికంగా పకటించి షాకిచ్చింది. కాగా, రియా గర్భవతి కావడంతోనే, ఆమె కుటుంబీకులు హడావుడిగా ఈ రహస్య వివాహాన్ని జరిపించినట్టు బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన రియా సేన్, తమిళంలో 'తాజ్ మహల్' చిత్రంలో నటించగా, ఆమె సోదరి రైమా తెలుగులో నితిన్ హీరోగా నటించిన 'ధైర్యం'లో తళుక్కుమన్న సంగతి విదితమే.