: పట్టాలపైకి దొర్లిపోయిన తన బిడ్డను అద్భుతంగా కాపాడుకున్న కన్న తల్లి... వీడియో చూడండి!


ఇదో షాకింగ్ ఇన్సిడెంట్. మరికొన్ని క్షణాల్లో రైలు వస్తుందనగా, ప్లాట్ ఫాంపై వేచి చూస్తున్న వేళ, ఓ మహిళ కుమారుడు దొర్లుకుంటూ వెళ్లి పట్టాలపై పడిపోగా, ఏ మాత్రం ఆలోచించకుండా తన బిడ్డను రక్షించుకుందో కన్నతల్లి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ పరిధిలో ఉన్న వెస్ట్ రైడ్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ రికార్డుల్లో నమోదైంది. తన ముగ్గురు పిల్లలతో కలసి రైలెక్కేందుకు స్టేషన్ కు వచ్చిన ఆమె, ఓ బిడ్డను చక్రాల తోపుడు బండిలో ఉంచింది. ప్రమాదవశాత్తూ అది దొర్లుకుంటూ వెళ్లి పట్టాలపై పడగా, ఆ తల్లి వెంటనే స్పందించిన తీరును ఈ వీడియోలో మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News