: రైలును కాపాడాల్సిన వారే ప్రయాణికులను దోచుకున్నారు... రాజధాని ఎక్స్ ప్రెస్ దోపీడీపై 14 మంది సస్పెన్షన్!


దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన అగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ దోపిడీ ఘటన వెనుక ఇంటి దొంగలదే ప్రధాన పాత్రని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక టీమ్ తేల్చింది. ఈ దోపిడీలో తొమ్మిది మంది ప్రయాణికుల నుంచి రూ. 15 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులు అందుకున్న రైల్వే పోలీసులు, కోటా, రాట్లాం ప్రాంతాలకు వెళ్లి విచారించారు. తమకు మత్తుమందిచ్చి దోచుకున్నారని అందరు బాధితులు చెప్పడం, ఇతరులు ఇచ్చినవేమీ తాము తినలేదని పేర్కొనడంతో పోలీసులకు తొలి అనుమానం రైల్వే హౌస్ కీపింగ్, కోచ్ అటెండెంట్లపై అనుమానం వచ్చింది.

ప్రయాణికులకు రైల్వే సిబ్బంది మత్తు మందులు కలిపిన ఆహారాన్ని ఇచ్చారని ప్రాథమికంగా నిర్థారించిన తరువాత, ఏడుగురు హౌస్ కీపింగ్, ఏడుగురు కోచ్ అటెండెంట్లను సస్పెండ్ చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇక తమ పోయిన పర్సులన్నీ, ఓ కోచ్ లోని టాయిలెట్ వద్ద బ్లాంకెట్ లో చుట్టి పడవేసి ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గుర్తించడంతో రైల్వే సిబ్బంది ప్రమేయం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News