: బార్సిలోనాలో హై అలెర్ట్... మెట్రో, రైల్వే స్టేషన్ల మూసివేత... అడుగడుగునా తనిఖీలు!


స్పెయిన్ లోని బార్సిలోనాలోని రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాది వ్యాన్ తో జనాలపైకి దూసుకెళ్లి 13 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 50 మందికి పైగా గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో ఓ రెస్టారెంట్ ను చుట్టుముట్టారు. అందులోని నలుగురు అనుమానితులను కాల్చి చంపారు.

అలాగే బార్సిలోనాతో పాటు స్పెయిన్ లోని ప్రధాన పట్టణాలన్నింట్లో హై అలెర్ట్ ప్రకటించారు. మెట్రో, రైల్వే స్టేషన్లను మూసేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అనుమానితులు ఎవరు కనబడినా సమాచారం అందించాలని సూచించారు. మరో ఉగ్రవాదిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

  • Loading...

More Telugu News