: బంజారాహిల్స్ హోటల్ లో టూరిస్టుపై అత్యాచారం!
హైదరాబాదులోని బంజరాహిల్స్ లోని ఒక హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాదు నగరాన్ని సందర్శించేందుకు ఈ నెల 5వ తేదీన ఢిల్లీ నుంచి ఒక యువతి వచ్చి, బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో దిగింది. అయితే ఆ హోటల్ లో ఆమె ఒంటరిగా ఉండడం గుర్తించిన సర్వీస్ బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.