: ‘నన్ను ఎవరు? అని అడిగితే ఏం చెబుతానో తెలుసా?’: హీరో బాలకృష్ణ


‘నన్ను ఎవరు? అని అడిగితే నేను ఏం సమాధానం చెబుతానో తెలుసా? అంటూ ‘పైసా వసూల్’ చిత్ర ఆడియో ఆవిష్కరణ రిలీజ్ వేడుకలో  హీరో బాలకృష్ణ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నన్ను ఎవరు? అని ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెబుతానో తెలుసా? ‘భారతీయుడు’ అని. మళ్లీ ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘తెలుగోడిని’ అని సమాధానం చెబుతా. ఇంకోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే..‘నందమూరి తారకరామారావు కొడుకుని’ అని చెబుతాను. మరోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఎన్టీఆర్ అభిమానిని’ అని చెబుతాను’ అంటూ బాలకృష్ణ ఆసక్తికరంగా మాట్లాడారు.

పూరీ జగన్నాథ్ తనను మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారని, దానికి కారణం.. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఈ చిత్ర నిర్మాత సవ్యంగా సమకూర్చడమేనని, అందుకే, ఈ ఉత్సాహం, స్పీడ్ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ తో తాను చేసిన మొదటి చిత్రమిదని, ‘పైసా వసూల్’ చేయడంలో ఈ చిత్రం దూసుకుపోతుందని బాలకృష్ణ అన్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను, ఆడియోను ఆవిష్కరించారు.   

  • Loading...

More Telugu News