: మన తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్!: ‘పైసా వసూల్’ నిర్మాత


మన తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్ దివంగత ఎన్టీ రామారావు అని ‘పైసా వసూల్’ నిర్మాత ఆనందప్రసాద్ అన్నారు. ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ నట వారసత్వంతో పాటు క్రమశిక్షణ, గొప్ప లక్షణాలు పుణికి పుచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని కితాబిచ్చారు. ‘ఈ చిత్రానికి తాను నిర్మాతను అని తెలియడంతో కొందరు నన్ను.. ‘బాలకృష్ణ గారికి కోపమెక్కువ కదా! ఆయనతో సినిమా ఎలా చేస్తారు?’ అని అడిగారు. నేను వారికి ‘అవును’ అనే చెప్పాను. ఆయనకు కోపమెక్కువే. కానీ, బాలయ్య మాట ఇస్తే సత్యహరిశ్చంద్రుడు, ఎదుటి వాళ్లు మాట తప్పితే మాత్రం ఆయన విశ్వామిత్రుడు. ఆ ఒక్క నిజం తెలిసిన ఎవరైనా కూడా ఆయనతో కలిసి పనిచేస్తే అద్భుతాలు చూడగలరు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News