: కమలహాసన్ మానసిక స్థితి సరిగా లేదు: తమిళ మంత్రి
తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని విమర్శించిన ప్రముఖ నటుడు కమలహాసన్ పై రెవెన్యూ శాఖ మంత్రి ఉదయ్ కుమార్ మండిపడ్డారు. కమల్ చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేకపోతున్నారని, మెంటల్ డిజార్డర్ తో ఆయన బాధపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, గోరఖ్ పూర్ లో శిశు మరణాలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వాళ్లు, పళనిస్వామి రాజీనామాకు ఎందుకు డిమాండ్ చేయరని కమల్ తన ట్వీట్ లో ఇటీవల ప్రశ్నించారు.
ఈ ట్వీట్ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు మండిపడ్డారు. అన్నాడీఎంకే అవినీతిపై నెల రోజుల క్రితం కమల్ చేసిన ఓ ప్రకటన నేపథ్యంలో ఆ పార్టీ మంత్రులు కొందరు కోర్టు కెక్కుతామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలకు భయపడని కమల్, ఆయా మంత్రులకు ఈ-మెయిల్స్ పంపాలని తన అభిమానులకు సూచించారు. ఎంత మందిపై కేసులు పెడతారో చూసుకుంటామంటూ కమల్ వ్యాఖ్యానించారు.