: బాలకృష్ణ కొట్టిన చెంపదెబ్బకు ఆ అభిమాని పొంగిపోయి ఉంటాడు!: కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడి సమర్థన
నంద్యాలలో నిన్న రాత్రి తన అభిమాన హీరో బాలకృష్ణకు పూల దండ వేసి, ఆయనతో ఓ ఫొటో దిగాలని భావించిన ఓ అభిమానికి తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఆ అభిమాని చెంప ఛెళ్లు మనిపించిన బాలయ్య తీరును కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సమర్ధించారు. ‘బాలకృష్ణ కొడితే ఆ అభిమాని పొంగిపోయి ఉంటాడు. బాలకృష్ణ చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆ అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.