: ‘పైసా వసూల్’ ఆడియో వేడుక ప్రారంభం
‘పైసా వసూల్’ ఆడియో వేడుక ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు బాలయ్య అభిమానులు ఇప్పటికే అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘పైసా వసూల్’ చిత్ర బృందం మరి కాసేపట్లో ఈ వేదిక వద్దకు చేరుకోనుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ నటించిన పలు చిత్రాల్లోని పాటలను సింగర్ సింహా బృందం ఆలపిస్తున్నారు. కాగా, బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో శ్రియ, కైరాదత్ హీరోయిన్లుగా నటించారు.