: ‘బిగ్ బాస్’లో ధన్ రాజ్ చెంప ఛెళ్లు మనిపించిన శివబాలాజీ!
తెలుగు ‘బిగ్ బాస్’ షోలో హాస్యనటుడు ధన్ రాజ్ పై మరో నటుడు శివ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చెంపఛెళ్లు మనిపించాడు. అసలు, ధన్ రాజ్ పై శివబాలాజీ ఎందుకు చేయి చేసుకున్నాడనే విషయం తెలియాలంటే ఈ రోజు రాత్రి 9.30 గంటలకు స్టార్ మా లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షో చూస్తే కానీ తెలియదు. అయితే, ఈ రోజు ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ ప్రోమోను స్టార్ మా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాగా, ‘బిగ్ బాస్’ ప్రారంభ షో నుంచి నటుడు శివబాలాజీకి కోపం ఎక్కువనే ఆరోపణలు తోటి నటీనటులు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షోలో మాత్రమే కనిపించే దీని వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ వద్ద నటీనటులు శివబాలాజీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కోపాన్ని అన్ని వేళలా ప్రదర్శించకూడదు..కోపాన్ని కూడా చిరు మందహాసంతో వ్యక్తం చేయాలి’ అని శివబాలాజీకి జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు సూచించారు.