: మరింత పెరిగిన బంగారం ధర
బంగారం ధర మళ్లీ పైపైకి వెళుతోంది. ఈ రోజు 10 గ్రాముల పసిడి ధర మరో రూ.300 పెరిగి రూ.30,000 మార్కును దాటి రూ.30,050గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ రోజు మార్కెట్లో కిలో బంగారం ధర రూ.900 పెరిగి, 40,000 మార్కును దాటి రూ.40, 200గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ధర అంతర్జాతీయంగా 0.43 శాతం పెరిగి సింగపూర్ మార్కెట్లో ఔన్సు ధర 1,288.30 అమెరికన్ డాలర్లుగా నమోదైంది.