: ఇక కారు శుభ్రం చేయడానికి నీళ్లు అవసరం లేదు... నిస్సాన్ ఇండియా కొత్త విధానం
నీళ్లు అవసరం లేకుండానే కారును సర్వీసింగ్ చేసే విధానాన్ని నిస్సాన్ ఇండియా గుర్గావ్‌లో ప్రవేశపెట్టింది. `హ్యాపీ విత్ నిస్సాన్` కార్యక్రమంలో భాగంగా నిస్సాన్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ సర్వీస్ సెంటర్లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిస్సాన్ ఎండీ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు.
ఈ కొత్త కార్ వాష్ విధానం వల్ల ఏడాదికి 130 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసే అవకాశం కలుగుతుందని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ `హ్యాపీ విత్ నిస్సాన్` ప్రచార కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు ఉచిత వెహికల్ చెకప్, ఉచిత టాప్ వాష్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు అరుణ్ చెప్పారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిస్సాన్ సర్వీస్ సెంటర్లలో ఆగస్టు 17 నుంచి 24 వరకు జరుగనుంది.