: అక్షయ్ కుమార్ `టాయ్‌లెట్` సినిమా తప్పకుండా చూడాలని గ్రామాధికారులకు సూచించిన హర్యానా ప్రభుత్వం
బహిరంగ మలవిసర్జనను నిషేధించాలని ప్రచారం చేస్తున్న అక్షయ్ కుమార్ `టాయ్‌లెట్` సినిమాను గ్రామాల్లో పనిచేసే సర్పంచ్, వీఆర్ఓలతో పాటు ప్రతి ఒక్క గ్రామాధికారి తప్పకుండా వీక్షించాలని హర్యానా ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు హర్యానా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఓపీ ధన్‌ఖర్ మార్గదర్శకం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ `స్వచ్ఛ్ భారత్ అభియాన్` ఆశయానికి మద్దతు తెలియజేస్తూ, బహిరంగ మలవిసర్జనను హాస్యపూరకంగా ఈ సినిమాలో చూపించారు. మెట్టినింట్లో టాయ్‌లెట్ లేకపోవడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ప్రియాంక భారతీ కథ ఆధారంగా శ్రీ నారాయణ్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో భూమీ ఫడ్నేకర్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లు వసూలు చేసింది.