: శిల్పా మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి: మాల మహానాడు కార్యకర్తలు
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీ పడుతున్న శిల్పా మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని మాల మహానాడు కార్యకర్తలు డిమాండ్ చేశారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఈ రోజు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడుకు చెందిన నేతలు మాట్లాడుతూ చాబోలులో దళితుల భూములను శిల్పా మోహన్ రెడ్డి బలవంతంగా ఆక్రమించారని... ఆ భూములను దళితులకు ఆయన తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.