: జైలు జీవితం చవిచూడాలా... ఈ హాస్టల్‌కి వెళ్లండి!
ఖైదీలు ధరించే దుస్తులు, వారు ఆహారం తీసుకునే పాత్రలు, ఇంకా ప్రతి అంగుళం జైలును తలపించేలా బ్యాంకాక్‌లోని ఉదోమ్ సుక్ ప్రాంతంలో ఓ హాస్టల్ నిర్మించారు. తొమ్మిది గదులున్న ఈ హాస్టల్‌ను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేసి విరమణ తీసుకున్న దంపతులు సిట్టిచాయ్ చైవోరాప్రగ్, పియానత్ తికావానిచ్‌లు నిర్వహిస్తున్నారు. దీని పేరు సూక్ స్టేషన్ హాస్టల్. 1994లో ఖైదీ జీవితం కథాంశంతో వచ్చిన `షాశంక్ రిడంప్షన్` సినిమాను ఆదర్శంగా తీసుకుని వారు ఈ హాస్టల్‌ను ఏర్పాటుచేశారు.
వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా ఖైదీలు వేసుకునే గీతల చొక్కా, గీతల ప్యాంట్లను కూడా అందించి, హాస్టల్‌లో ఉన్నంత సేపు అవే ధరించాలనే షరతు పెట్టారు. ఈ షరతు పెట్టిన దగ్గర్నుంచి వచ్చిన అతిథులకు పూర్తిగా జైల్లో ఉన్నట్లే అనిపిస్తుందని, ఈ అనుభూతి కోసం వారు మళ్లీ మళ్లీ తమ హాస్టల్‌కు వస్తున్నారని సిట్టిచాయ్ తెలిపారు. ఇక్కడ ఒక రాత్రి ఉండాలంటే 24 నుంచి 49 డాలర్లు చెల్లించాల్సిందే మరి!