: టీడీపీలో గంగుల ప్రతాప్ రెడ్డి చేరికపై భూమా అఖిలప్రియ స్పందన!
గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. తమ కుంటుంబానికి, గంగుల కుటుంబానికి వైరం ఉన్నమాట వాస్తవమేనని... తమ మధ్య ఏదైనా సమస్య వచ్చినా తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. అమ్మనాన్నలనే కోల్పోయిన తమకు, ఏ ఇతర సమస్య కూడా పెద్దది కాదని ఆమె అన్నారు.