: రూ. 2.5 లక్షలిస్తే రాజకీయ నాయకుడిగా మారుస్తారట... ఎగబడిన ఎంబీఏలు, ఐఐటీయన్లు!


రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించాలని భావించే వారి కోసం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డొమొక్రెటిక్ లీడర్ షిప్(ఐఐడీపీఎల్) ఓ ప్రత్యేక కోర్సును 'పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ లీడర్‌ షిప్' పేరిట ప్రారంభించింది. ఈ కోర్సులో చేరేందుకు రూ. 2.5 లక్షలు చెల్లించాలని, 9 నెలల్లో కోర్సు పూర్తవుతుందని, ఆపై ఉత్తమ నేతగా ఎదగవచ్చని ప్రచారం చేసింది. ఇండియాలోనే ఈ తరహా కాలేజీల్లో ఇదే మొదటిదని ఆర్ఎస్ఎస్ తెలిపింది.

ఇక తొలి బ్యాచ్ క్లాసులు బుధవారం నాడు ప్రారంభం కాగా, ఎంబీఏ చదివిన వారు, ఐఐటీయన్లు సహా 32 మంది చేరారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల యువకులు తొలి బ్యాచ్ శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ చంద్ర అనే రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన వ్యక్తి, తన వారసత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన శిక్షణ కోసం ఇక్కడ చేరాడు.

  • Loading...

More Telugu News