: మెడికోల వరుస ఆత్మహత్యలు...అనంతపురంలో మరో మెడికో ఆత్మహత్య
నిర్మల్ జిల్లాకు చెందిన మెడికో సవిత మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నుంచి తేరుకోకముందే అనంతపురం జిల్లాలో మరో మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. జీఎంసీఏ అనంతపురం కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న యశ్వంత్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని యశ్వంత్ తన సూసైడ్ నోట్ లో పేర్కొనడం విశేషం. గత కొంత కాలంగా విద్య కఠినంగా మారిందని, చదువుతున్నా సరైన ఫలితాలు సాధించలేకపోతున్నానన్న ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.