: రూ. 1,333.30 కొట్టాల్సిన చోట రెండు 'సున్నా'లు అధికంగా కొడితే... 'రైల్వే' ఘనకార్యమిది!


నోట్ల రద్దు తరువాత, ఆన్ లైన్ లావాదేవీలు, కార్డు సాయంతో చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. ఏదైనా కొనుగోలు చేసిన తరువాత డబ్బు చెల్లించాల్సి వస్తే జేబులు వెతుక్కోకుండా, కార్డు తీసిస్తున్న వారే అత్యధికులు. ఇదే సమయంలో స్వైపింగ్ మెషీన్ లో ఎంత మొత్తం ఎంటర్ చేశారన్న విషయాన్ని చూడకుండా పిన్ ఎంటర్ చేస్తే ఏమవుతుందో ముంబై వాసికి తెలిసొచ్చింది. ఇప్పుడాయన తన ఖాతా నుంచి పోయిన డబ్బుతో లబోదిబోమంటున్నాడు.

విషయంలోకి వెళితే, ముంబై లోకల్ ట్రైన్ పాస్ కోసం వికాస్ మంచేకర్ అనే వ్యక్తి కౌంటర్ వద్దకు వెళ్లి, రూ. 1,333.30 చెల్లించే నిమిత్తం క్రెడిట్ కార్డును బుకింగ్ క్లర్కుకు ఇచ్చాడు. సదరు క్లర్క్ పొరపాటున  రూ.1333.30 బదులుగా రూ.1,33,330.00 అని ఎంటర్ చేశాడు. ఆ వెంటనే వికాస్ ఖాతా నుంచి డబ్బు రైల్వే ఖాతాకు వెళ్లిపోగా, ఆ తరువాత విషయాన్ని తెలుసుకున్న వికాస్, రైల్వే కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తాన్ని రికవరి చేసుకోవడానికి రైల్వే కార్యాలయం చుట్టూ తాను తిరుగుతున్నానని, ఈ నెల 24లోగా ఆ డబ్బు జమ కాకుంటే, తనకు రూ. 5 వేల వరకూ జరిమానా పడుతుందని వాపోతున్నాడు.

  • Loading...

More Telugu News