: ఖమ్మంలో సందడి చేయనున్న బాలయ్య!
నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం 'పైసా వసూల్' ఆడియో విడుదల కార్యక్రమం ఈ సాయంత్రం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి బాలయ్యతో పాటు, నటి శ్రియ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత వెనిగండ్ల ఆనంద్ ప్రసాద్ తదితరులు హాజరుకానున్నారు.
ఈ వేడుకను పురస్కరించుకుని బాలయ్య అభిమాన సంఘం నిన్న నగరంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించింది. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య హైదరాబాద్ చేరుకుని... ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం వెళ్లనున్నట్టు తెలుస్తోంది.