: సుస్మితాసేన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు!


ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుస్మితా సేన్ 2008లో విదేశాల నుంచి ఒక విలాసవంతమైన కారును తెప్పించుకున్నారు. ఓడలో చెన్నై పోర్టుకు చేరుకున్న ఆ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. ఈ కోర్టులో జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. దీనిపై జూన్ లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News