: బీసీసీఐ పెద్దలకు షాక్... వారిని తొలగించాలంటూ సుప్రీంకు నివేదిక!


బీసీసీఐ పెద్దలకు పాలకుల కమిటీ షాక్ ఇచ్చింది. లోథా కమిటీ సిఫారసులు అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని చెబుతూ సుప్రీంకోర్టుకు బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) నివేదిక ఇచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే... బీసీసీఐలో సంస్కరణలు అమలు చేయాలని చెబుతూ సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ పదవుల్లో రాజకీయనాయకులకు స్థానం లేదని చెబుతూ, లోథా సిఫారసులు అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంటూ అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలపై సుప్రీంకోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే.

వారి స్థానంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సీకే ఖన్నాను, కార్యదర్శిగా అమితాబ్‌ చౌదరిని, కోశాధికారిగా అనిరుధ్‌ చౌదరిలను ఎంపిక చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లోథా కమిటీ సిఫారసుల్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని, వారిని తప్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఓఏ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు 26 పేజీల నివేదికను కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చింది. 

  • Loading...

More Telugu News