: వైసీపీకి మరో షాక్.. కాసేపట్లో చంద్రబాబుతో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరే విషయమై ఈ రోజు టీడీపీ నేత అచ్చెన్నాయుడితో కాసేపు చర్చించిన ప్రతాప్ రెడ్డి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో చర్చిస్తున్నారు. అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో ఉన్న చంద్రబాబు నాయుడి వద్దకు ప్రతాప్ రెడ్డి బయలుదేరారు. టీడీపీలో చేరే అంశంపై ఆయన చంద్రబాబుతో చర్చించనున్నట్లు సమాచారం.