: నేరస్తులు భయపడేలా పోలీసుల ఫిజికల్ ఫిట్ నెస్ ఉండాలి: సీఎం చంద్రబాబు
నేరస్తులు భయపడేలా పోలీసుల ఫిజికల్ ఫిట్ నెస్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలోని డీజీపీ ఆఫీసు వద్ద ఆక్టోపస్ విన్యాసాలను చంద్రబాబు, స్పీకర్ కోడెల, డీజీపీ సాంబశివరావు తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మన ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాయని అన్నారు. పోలీసులందరికీ ఇళ్లు ఇస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వనరులు మనకు ఉన్నాయని, అమరావతిలో సారవంతమైన భూమి ఉందని, బ్లూ, గ్రీన్ రాజధాని మనదని అన్నారు. ఈ సందర్భంగా బోరులో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడిన అధికారులను చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా సాధ్యమని అధికారులు నిరూపించారని అన్నారు.