: పిలిప్పీన్స్‌లో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ 32 మందిని కాల్చి చంపిన పోలీసులు!
పిలిప్పీన్స్‌లో డ్రగ్స్ అమ్మే ముఠాలపై ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ వారిని పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపేయడానికి వెనకాడడం లేదు. నిన్న దాడులు నిర్వహించిన పోలీసులు ఒక్క రోజులోనే 32 మందిని కాల్చి చంపారు. మనీలాకు ఉత్తరం వైపున ఉన్న బులాకన్ ప్రావిన్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడుల్లో మరో వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ డ్రగ్స్, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆ దేశ అధ్యక్షుడిగా డ్యుటెర్టి ప్రమాణ స్వీకారం చేసి డ్రగ్స్‌ను పూర్తిగా అరికడతానని హామీ ఇచ్చారు.