: ఎరవాడ సెంట్రల్ జైలులో `లక్నో సెంట్రల్` సినిమా పాట విడుదల
బాలీవుడ్ నటుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్ తర్వాతి చిత్రం `లక్నో సెంట్రల్` సినిమా పాటను పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైల్‌లో 4,000 మంది ఖైదీల మధ్యన చిత్ర యూనిట్‌తో కలిసి విడుదల చేశారు. 71వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని `లక్నో సెంట్రల్` చిత్ర యూనిట్ ఎరవాడ సెంట్రల్ జైలులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖైదీల కోరిక మేరకు ఫర్హాన్ అక్తర్ వారితో కలిసి ఆడిపాడారు. `లక్నో సెంట్రల్` సినిమాలో గాయకులుగా ఎదగాలనుకున్న నలుగురు ఖైదీల జీవితం గురించి చూపించామని, ఆ సినిమా పాటను ఖైదీల చేతుల మీదుగా విడుదల చేయించినందుకు ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు రంజీత్ తివారీ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి డయానా పెంటీ, రోనిత్ రాయ్, రాజేశ్ శర్మ, రవి కిషన్, దీపక్, ఇనాములాఖ్‌లతో పాటు చిత్ర సంగీత దర్శకులు రోచక్ కొహ్లీ, అర్జున హర్జాయ్‌లు కూడా పాల్గొన్నారు.