: జియో మరో అద్భుత ఆఫర్... ఏకంగా 25 శాతం క్యాష్ బ్యాక్!


ఇప్పటికే పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించి మిగతా టెలికం సంస్థలకు నిద్రలేకుండా చేసిన రిలయన్స్ జియో, తాజాగా, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ రీచార్జ్ లపై మరో అద్భుత ఆఫర్ ను ప్రకటించింది. పేటీఎం, ఫోన్ పే చెల్లింపు మాధ్యమాల ద్వారా రీచార్జ్ చేసుకుంటే 25 శాతం వరకూ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. పేటీఎం ద్వారా రూ. 300 రీచార్జ్ చేసుకుంటే రూ. 76, ఫోన్ పే ద్వారా అయితే, రూ. 75 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది.

ఈ ఆఫర్ కావాలంటే, జియో యూజర్లకు కంపెనీ పంపిన ప్రోమో కోడ్ ను ఎంటర్ చేయాల్సి వుంటుంది. ఆపై పేటీఎం యాప్ లో మొబైల్ రీచార్జ్ ఆప్షన్ ఎంచుకుని, ఫోన్ నంబర్ ఫీడ్ చేసి, 'ప్రోగ్రెస్ టు రీచార్జ్' లింక్ ను క్లిక్ చేయాలి. ఆపై ప్రోమో కోడ్ ఎంటర్ చేసి రీచార్జ్ తో పాటు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. రీచార్జ్ జరిగిన 24 గంటల్లోపు క్యాష్ బ్యాక్ ఆఫర్ లో భాగంగా రావాల్సిన డబ్బు మీ ఖాతాకు జమ అవుతుంది. మరిన్ని వివరాలు జియో అధికార వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News