: 12 మంది నైజీరియన్లను తిరిగి పంపేందుకు సిద్ధమైన హైదరాబాదు పోలీసులు!
హైదరాబాదులో డ్రగ్ విక్రయాలు, సరఫరాతో దందా నడుపుతున్న 12 మంది నైజీరియన్లను తిరిగి స్వదేశానికి పంపాలని హైదరాబాదు పోలీసులు నిర్ణయించారు. సిట్ దాడుల నేపథ్యంలో చిన్న పిల్లలను కూడా మత్తుకు బానిసలుగా మారుస్తుండడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిందితులైన నైజీరియన్లు ఇంకా హైదరాబాదులో ఉంటే మరింత ప్రమాదమని భావించిన సిట్ అధికారులు లా అండ్ ఆర్డర్ అధికారులతో కలిసి వారిని స్వదేశానికి పంపేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు 8 మందిని ఇప్పటికే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. వారి వివరాలను నైజీరియా ఎంబసీతో కలిసి పంచుకున్నారు. మిగిలిన వారితో పాటు, జైలులో ఉన్న వారిని కూడా తిరిగి స్వదేశానికి పంపేయాలని నిర్ణయించారు.