: ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చోటు!
ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ఒకటని ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పొదిలె అప్పారావు తెలిపారు. హెచ్సీయూలో నిర్వహించిన 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటని అన్నారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీ ర్యాంకుల్లో ఇది స్థానం సంపాదించుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ విశ్వవిద్యాలయ అవార్డును వర్సిటీ శానిటరీ విభాగం ఉద్యోగి ఆర్.బిక్షపతికి అందజేశారు.