: శ్రమ ఫలించింది...అందరికీ ధన్యవాదాలు: ప్రత్తిపాటి పుల్లారావు
11 గంటల శ్రమ ఫలించిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల చంద్రశేఖర్ ను బోరుబావి లోంచి బయటకు తీసిన తరువాత ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమ ఫలించిందని అన్నారు. బాబును క్షేమంగా బయటకు తీయడంతో పట్టరాని ఆనందం కలిగిందని ఆయన చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. సహాయకచర్యల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయకచర్యలు, పనుల పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.