: 11 గంటల ఉత్కంఠ దూదిపింజలా తేలిపోయింది!


బోరు బావిలో పడిన బాలుడు చందు మృత్యుంజయుడిగా రావడంతో అందరిలోనూ ఆనందం పెల్లుబికింది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సభ్యుల ఆనందానికి అంతే లేదు. '11 గంటల ఉత్కంఠ దూదిపింజలా తేలిపోయింద'ని ఎన్డీఆర్ఎఫ్ దళాలు తెలిపాయి. నేల అడుగుకు వెళ్తున్న కొద్దీ సున్నపురాయి పడిందని ఎన్డీఆర్ఎఫ్ దళాలు పేర్కొన్నాయి. మొదట చందును క్షేమంగా తీసేందుకు రోబోటిక్ హ్యాండ్ సహాయం తీసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ దళాలు తెలిపాయి.

అయితే సున్నపురాయి అడ్డుపడడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నామని, బాబును తీయడమే లక్ష్యంగా మైన్స్ కు రంధ్రం వేసే డ్రిల్స్ తెప్పించి బోరుబావిని చేరుకునే ప్రయత్నం చేశామని అన్నారు. అయితే అది కూడా విఫలమయ్యేలా కనిపించడంతో జాగ్రత్తగా జేసీబీతో మట్టిని తవ్వించామన్నారు. అలా లోతునుంచి తవ్వుకుంటూ చంద్రశేఖర్ ను బయటకు తీశామన్నారు. ఈ క్రమంలో చందుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి 2:38 నిమిషాలకు చంద్రశేఖర్ క్షేమంగా బయటపడడంతో అంతవరకు పడ్డ శ్రమ అంతా దూదిపింజలా తేలిపోయిందని అన్నారు.
 
 

  • Loading...

More Telugu News